సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలి : కలెక్టర్ హైమావతి

సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలి : కలెక్టర్ హైమావతి
  •      కలెక్టర్ హైమావతి 

సిద్దిపేట రూరల్, వెలుగు : విపత్తుల సమయంలో అధికారులంతా సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ కే.హైమావతి సూచించారు. వరదల వంటి విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా వరదలు, వాగులు ఉప్పొంగడం, వాటిలో ప్రజలు, పశువులు చిక్కుకున్నప్పడు కాపాడేందుకు మాక్ డ్రిల్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. 

వరదల సమయంలో జిల్లా యంత్రాంగం తక్షణమే ఎలా స్పందించాలి, వివిధ శాఖలు సమన్వయంతో సహాయక చర్యలను ఎలా అమలు చేయాలనే అంశాలపై  ప్రత్యక్షంగా ప్రదర్శించారన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ అబ్దుల్ హమీద్, అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.