
షిమ్కెంట్ (కజకిస్తాన్): ఇండియా టాప్ షూటర్, ఒలింపియన్ సిఫ్ట్ కౌర్ శర్మ.. ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో డబుల్ గోల్డ్ మెడల్‌తో మెరిసింది. మంగళవారం జరిగిన విమెన్స్ ఇండివిడ్యువల్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ ఫైనల్లో సిఫ్ట్ కౌర్ 459.2 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచి స్వర్ణం సాధించింది. చైనా షూటర్ యాంగ్ యుజి (458.8), నొబాట మిసాకి (448.2) వరుసగా సిల్వర్, బ్రాంజ్‌ను గెలుచుకున్నారు. టీమ్ విభాగంలో సిఫ్ట్ కౌర్ (589)–అంజుమ్ మౌద్గిల్ (578)–అషి చౌక్సీ (586) బృందం 1753 పాయింట్లతో గోల్డ్‌ను కైవసం చేసుకున్నారు.
ఈ కేటగిరీలో జపాన్ (1750), సౌత్ కొరియా (1754)కు సిల్వర్, బ్రాంజ్ లభించాయి. సిఫ్ట్ కౌర్‌కు ఇది నాలుగో ఆసియా గోల్డ్ మెడల్ కావడం విశేషం. ఇండివిడ్యువల్ క్వాలిఫికేషన్స్‌లో సిఫ్ట్ కౌర్ 589 పాయింట్లతో టాప్, చౌక్సీ (402.8) ఏడో ప్లేస్‌లో నిలిచారు. జూనియర్ విమెన్స్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్‌లో అనుష్క తోకూర్ 460.7 పాయింట్లతో గోల్డ్ మెడల్‌ను గెలిచింది. ప్రాచీ గైక్వాడ్, మహతి సంధూ ఐదు, ఆరు స్థానాలతో సరిపెట్టుకున్నారు. టీమ్ విభాగంలో అనుష్క (583)–ప్రాచీ గైక్వాడ్ (588)–మహతి సంధూ(587) బృందం 1758 పాయింట్లతో గోల్డ్‌ను నెగ్గింది.
సౌత్ కొరియా (1740), కజకిస్తాన్ (1706) సిల్వర్, బ్రాంజ్‌ను సొంతం చేసుకున్నాయి. జూనియర్ మెన్స్ 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్‌లో సమీర్ 21 పాయింట్లతో బ్రాంజ్ మెడల్‌ను సాధించాడు. టీమ్ ట్రాప్‌లో ఆర్య వన్ష్ త్యాగీ (112)–అర్జున్ (110)–ఉదవ్ రాథోర్ (106) బృందం 328 పాయింట్లతో బంగారు పతకాన్ని నెగ్గారు. వ్యక్తిగత విభాగంలో ఆర్య వన్ష్ సిల్వర్ మెడల్‌తో నిలిచాడు. జూనియర్ విమెన్స్ ట్రాప్‌లో హారిస్ సబీరా (39), ఆద్యా కట్యాల్ (38) వరుసగా గోల్డ్, సిల్వర్‌ను గెలిచారు. విమెన్స్ ట్రాప్ టీమ్‌లో సబీరా (105)–ఆద్యా (110)–భవ్యా త్రిపాఠీ (109).. 324 పాయింట్లతో స్వర్ణ పతకం కైవసం చేసుకున్నారు.