పెరిగిన సిల్వర్ జ్యూయల్లరీ ఎక్స్‌ పోర్ట్‌లు

పెరిగిన సిల్వర్ జ్యూయల్లరీ ఎక్స్‌ పోర్ట్‌లు

అఫర్డబుల్ ధరలు, నప్పే డిజైన్లే కారణం

థాయ్లాండ్, చైనాతో ఇండియా పోటీ

కోల్‌కతా: సిల్వర్ జ్యూయల్లరీ ఎగుమతులు ఇండియాలో ఏప్రిల్–జూలై మధ్య కాలంలో 120.54 శాతం పెరిగాయి. మొత్తంగా జెమ్ అండ్ జ్యూయల్లరీ ఎగుమతు‌‌లు 46 శాతం తగ్గిన క్రమంలో, సిల్వర్ జ్యూయల్లరీ ఎగుమతులు పెరుగుదలను నమోదు చేశాయి. అఫర్డబుల్ ధరలకు సిల్వర్ జ్యూయల్లరీ అందుబాటులో ఉండటంతో వీటి ఎక్స్‌ పోర్ట్‌‌లు పెరిగాయి. అంతేకాక సిల్వర్ జ్యూయల్లరీలో మెరుగైన డిజైన్లు లభిస్తున్నాయి. సిల్వర్ జ్యూయల్లరీకి మేజర్ ప్లేయర్లుగా ఉన్న థాయ్‌లాండ్, చైనాలకు ఇండియా గట్టి పోటీ ఇవ్వనుందని ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌ లు చెప్పారు. జెమ్ అండ్ జ్యూయల్లరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సి ల్ (జీజేఈపీసీ) లెక్కల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో సిల్వర్ జ్యూయల్లరీ ఎక్స్‌పోర్ట్‌‌లు రూ.3,855.65 కోట్లకు పెరిగాయి. ఇవి గతేడాది ఇదే కాలంలో రూ.1,748.30 కోట్లుగా ఉన్నాయి.

‘సిల్వర్ ధరలు అఫర్డబుల్‌‌గా ఉండటంతో పాటు, ఇండియన్ డిజైన్‌‌లను విదేశీ కొనుగోలు దారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ కేటగిరీలో రెండు మేజర్ ప్లేయర్లుగా ఉన్న థాయ్‌లాండ్, చైనాలతో మనం త్వరలోనే పోటీ పడనున్నాం ’ అని జీజేఈపీసీ ఛైర్మన్ కోలిన్ షా అన్నారు. ఈ ఏడాది కరోనా దెబ్బకు మెక్సికో, పెరూ, బొలివియాలో సిల్వర్ ప్రొడక్షన్ తగ్గింది. సిల్వర్ ఇన్‌‌స్టిట్యూట్ వరల్డ్ సిల్వర్ సర్వే 2020 ప్రకారం, మైన్డ్ అవుట్‌‌పుట్ 1,694 టన్నులకు పడిపోయింది. ఇండియాలో మొత్తంగా జెమ్స్ అండ్ జ్యూయల్లరీ ఎగుమతులు 45.92 శాతం తగ్గి రూ.30,983.84 కోట్లుగా ఉన్నాయి. ఇవి గతేడాది ఇదే కాలంలో రూ.57,288.02 కోట్లుగా నమోదయ్యాయి. జూలైలో ఈ ఎగుమతులు రూ.15,112.53 కోట్ల నుంచి రూ.10,187.04 కోట్లకు పడిపోయాయి. గోల్డ్ జ్యూయల్లరీ ఎగుమతులు ఏప్రిల్–జూలైలో 71.33 శాతం తగ్గి రూ.3,735.97 కోట్లుగా ఉన్నాయి.