
న్యూఢిల్లీ: గ్లోబల్ మార్కెట్లలో ధరలు పెరగడంతో ఇండియాలో కూడా వెండి ధరలు గరువారం ర్యాలీ చేశాయి. కేజీ ధర రూ.1,000 పెరిగి న్యూఢిల్లీలో రూ.1.40 లక్షల గరిష్ట స్థాయిని తాకింది. గత సెషన్లో ఇది రూ.1,39,000 వద్ద ముగిసింది. ఇక 99.9శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.630 తగ్గి రూ.1,17,370 (10 గ్రాములకు)గా నమోదైంది. 99.5శాతం స్వచ్ఛత కలిగిన బంగారం రూ.700 తగ్గి రూ.1,16,700 కి చేరింది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ఔన్స్(28 గ్రాముల) కి 0.57శాతం పెరిగి 3,757.54 డాలర్లకి చేరగా, స్పాట్ సిల్వర్ ధర 2శాతం పైగా పెరిగి ఔన్స్‌కి 45.03 డాలర్లను టచ్ చేసింది. ఇది 14 ఏళ్ల గరిష్ట స్థాయికి దగ్గరగా ఉంది.