
సిన్సినాటి: ఇటలీ టెన్నిస్ స్టార్, వరల్డ్ నంబర్ వన్ యానిక్ సినర్ సిన్సినాటి ఓపెన్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టాస్ సీడ్ సినర్ 6-–0, 6–-2తో ఫెలిక్స్ ఆగర్- అలియాసిమ్ (కెనడా)ను వరుస సెట్లలో చిత్తు చేశాడు. ఏకపక్షంగా సాగిన ఈ పోరును సినర్ కేవలం 71 నిమిషాల్లోనే ముగించాడు. ఈ క్రమంలో టోర్నీలో వరుసగా ఎనిమిదో, సీజన్‌లో 30వ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. హార్డ్ కోర్టులో సినర్‌కు వరుసగా 25వ విజయం. సెమీస్‌లో ఫ్రెంచ్ క్వాలిఫయర్ టెరెన్స్ ఆట్టనేతో సినర్‌తలపడనున్నాడు.