హైదరాబాద్, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని థర్మల్ పవర్‌ప్లాంట్‌లో చేపట్టిన ఎకోఫ్రెండ్లీ ఫ్లూ గ్యాస్ డీ సల్ఫరైజేషన్ (ఎఫ్‌జీడీ) ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని సింగరేణి సీఎండీ శ్రీధర్ నిర్మాణ ఏజెన్సీలను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ లోని సింగరేణి భవన్‌లో ఎఫ్‌జీడీ పనులపై ఆయన రివ్యూ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ ప్లాంట్ పనులు గడువు కన్నా ముందే పూర్తిచేసి ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌కు చెందిన పీఈఎస్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్.. టెండర్ ను దక్కించుకొని ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టింది. ఇప్పటి వరకు 20% పనులు పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టులో యూనిట్–1 కు సంబంధించిన ఎఫ్‌జీడీని 2024, జూన్ కల్లా పూర్తి చేయాలని, రెండో యూనిట్ ఎఫ్‌జీడీని అదే ఏడాది సెప్టెంబర్‌లోపు పూర్తి చేయాలని సీఎండీ నిర్దేశించారు.
