- కార్మిక శాఖ కార్యదర్శి దాసరి హరిచందన వెల్లడి
హైదరాబాద్ సిటీ, వెలుగు: వంట గ్యాస్ డెలివరీ బాయ్స్ ఎదుర్కొంటున్న సమస్యల్ని నెల రోజుల్లోపు పరిష్కరించేందుకు కృషి చేస్తానని కార్మిక శాఖ కార్యదర్శి దాసరి హరిచందన అన్నారు. బుధవారం తెలంగాణ కుకింగ్ గ్యాస్ డెలివరీ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ సలహాదారు కమిటీ చైర్మన్ మాజీ ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు, కమిటీ నాయకులు సెక్రటేరియెట్‌లో కార్మిక శాఖ కార్యదర్శిని కలిశారు.
ఎల్‌పీజీ డెలివరీ బాయ్స్‌కు కనీస జీతాలు ఇవ్వడం లేదని.. ఈఎస్‌ఐ, పీఎఫ్‌లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హరిచందన మాట్లాడుతూ.. డిస్ట్రిబ్యూటర్లకు కార్మిక శాఖ తరఫున నోటీసులు అందిస్తామన్నారు. డిస్ట్రిబ్యూటర్లతో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
