ముంబై: ఐపీఎల్ ఫైనల్ వరుసగా రెండో ఏడాది అహ్మదాబాద్‌లోనే జరగనుంది. తొలుత బెంగళూరును వేదికగా నిర్ణయించినా తాజా మార్పులతో అహ్మదాబాద్‌కు అవకాశం దక్కింది. ధర్మశాల, న్యూ చండీగఢ్ వేదికలకు ప్లేఆఫ్ మ్యాచ్‌ల నిర్వహణ బాధ్యతలను బీసీసీఐ అప్పగించింది.
గతేడాది విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కావడంతో సంప్రదాయం ప్రకారం ఫైనల్ బెంగళూరులో జరగాల్సింది. కానీ స్థానిక సంఘం, అధికారుల నుంచి వచ్చిన కొన్ని అదనపు డిమాండ్లు బోర్డు నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో వేదికను మార్చాల్సి వచ్చిందని బీసీసీఐ తెలిపింది.
కర్నాటక ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు మూడు కాంప్లిమెంటరీ టిక్కెట్ల కోటా ఇవ్వాలనే నిర్ణయంతో బోర్డు ఏకీభవించలేదని తెలుస్తోంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో పరిమిత ప్రేక్షక సామర్థ్యం ఉండడం, గతేడాది అక్కడ జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ప్లే ఆఫ్ షెడ్యూల్
క్వాలిఫయర్ 1: మే 26 -
హెచ్‌పీసీఏ స్టేడియం, ధర్మశాల.
ఎలిమినేటర్: మే 27 న్యూ ఇంటర్నేషనల్
క్రికెట్ స్టేడియం, కొత్త చండీగఢ్.
క్వాలిఫయర్ 2 : మే 29 - న్యూ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, కొత్త చండీగఢ్.
ఫైనల్: మే 31 నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్.
