ఒడిశా నైనీ బ్లాక్ నుంచి బొగ్గు రవాణా ...ఉత్పత్తి, రైల్వే గూడ్స్షెడ్లను పరిశీలించిన సింగరేణి డైరెక్టర్లు

ఒడిశా నైనీ బ్లాక్ నుంచి బొగ్గు రవాణా ...ఉత్పత్తి, రైల్వే గూడ్స్షెడ్లను పరిశీలించిన సింగరేణి డైరెక్టర్లు

కోల్​బెల్ట్, వెలుగు: ఒడిశాలోని అంగుల్​జిల్లాలో సింగరేణి సంస్థకు చెందిన నైనీ ఓపెన్​కాస్ట్​ బొగ్గు గనిని బుధవారం సింగరేణి డైరెక్టర్లు సందర్శించారు. ఎగ్జిక్యూటివ్​డైరెక్టర్, చీఫ్​విజిలెన్స్​ఆఫీసర్​బి.వెంకన్న, డైరెక్టర్(ఆపరేషన్స్)ఎల్.వి.సుబ్రమణ్యం, ఇతర ఆఫీసర్లు ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణా,స్టాక్​యార్డు, డిస్పాచ్, కాంట్రాక్టులు, లాజిస్టిక్స్ వంటివి పరిశీలించారు. 

ఈ సందర్భంగా నైనీ కోల్​బ్లాక్​లో బొగ్గు ఉత్పత్తి పురోగతి, ఆపరేషనల్ ​కెపాసిటీ, కస్టమర్లకు బొగ్గు సప్లై తీరుపై నైనీ ఏరియా జీఎం మజుందార్, ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నారు. రోజూ16 వేల టన్నుల ఉత్పత్తిని టార్గెట్​గా చేసుకున్నామని ఆఫీసర్లు పేర్కొన్నారు. అనంతరం బొగ్గును రవాణాకు ఏర్పాటు చేసిన అంగుల్​జిల్లాలోని జారపాడ రైల్వే గూడ్స్​షెడ్, హండప్ప రైల్వే గూడ్స్​షెడ్లను పరిశీలించారు. 

జారపాడ రైల్వే గూడ్స్​షెడ్​నుంచి రైల్వే సముద్రం​రైల్వే (ఆర్ఎస్ఆర్) మార్గం ద్వారా పరాదీప్, ధమ్రా, గోపాలపురం పోర్టుల నుంచి తమిళనాడు జెన్​కోకు బొగ్గు రవాణాపై సమీక్షించారు. ఈ సందర్భంగా కస్టమర్లకు సమయానుకూలంగా, సాఫీగా సప్లై చేసేలా చర్యలు తీసుకోవాలని నైనీ ఏరియా ఆఫీసర్లను సింగరేణి ఎగ్జిక్యూటివ్​డైరెక్టర్, సీవీవో బి.వెంకన్న ఆదేశించారు.

 తమిళనాడు జెన్​కోకు ఏడాదికి 50లక్షల టన్నుల బొగ్గును సప్లై చేయాల్సి ఉందని, ఇందుకు రోజూ 4 రేక్​ల చొప్పున ట్రాన్స్ పోర్ట్ చేయాలని ఈడీ ఆదేశించారు. మూడు రోజులుగా సింగరేణి డైరెక్టర్లు నైనీ కోల్​బ్లాక్ ఏరియాలో పర్యటిస్తున్నారు.