సింగరేణి భూనిర్వాసితుల సంఘం కొత్త కమిటీ

సింగరేణి భూనిర్వాసితుల సంఘం కొత్త కమిటీ

బషీర్​బాగ్​,వెలుగు: సింగరేణి ల్యాండ్ లూజర్స్ అసోసియేషన్‌‌‌‌(సింగరేణి భూ నిర్వాసితుల సంఘం) కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం బషీర్ బాగ్ లో ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షుడిగా మాధవ్ రావు, సెక్రటరీగా నాంపల్లి రమేశ్, జాయింట్ సెక్రటరీగా రాజమనోహర్, ట్రెజరర్‌‌‌‌గా పోటుగంటి రవి, వర్కింగ్ ప్రెసిడెంట్‌‌‌‌గా కంది సీను, గౌరవ అధ్యక్షుడిగా రాసమల్ల సంపత్‌‌‌‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.