సింగరేణిలో ఉద్యోగం అదృష్టం: జీఎం

సింగరేణిలో ఉద్యోగం అదృష్టం: జీఎం

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణిలో ఉద్యోగం దక్కడం అదృష్టమని, యువ ఉద్యోగులు సంస్థ పురోభివృద్ధికి కృషి చేయాలని మందమర్రి ఏరియా జీఎం జి.దేవేందర్​అన్నారు. మెడికల్​ఇన్​వాలిడేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన యువతీయువకులకు శుక్రవారం జీఎం ఆఫీస్​ కాన్ఫరెన్స్​ హాల్​లో ఆయన జాయినింగ్​ఆర్డర్స్​ అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ఏరియాలో ఇప్పటి వరకు కారుణ్య నియామకాల ద్వారా 1985 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు తెలిపారు. 

విధులకు గైర్హాజరు కాకుండా కష్టపడి పనిచేసి ఉన్నతస్థాయికి ఎదగాలని సూచించారు. అనంతరం మందమర్రి ఏరియా వర్క్​షాప్​లో జనరల్​ మజ్దూర్​గా పనిచేస్తున్న బొగ్గు కుమారస్వామి కూతురు వైష్ణవికి స్కాలర్​షిప్​ కింద రూ.10 వేల చెక్కును జీఎం అందజేశారు. కార్యక్రమాల్లో ఏరియా పర్సనల్ మేనేజర్​ఎస్.శ్యాంసుందర్, ఏఐటీయూసీ జీఎం స్ట్రక్చర్​కమిటీ మెంబర్​సీవీ రమణ, ఆఫీసర్ల సంఘం ప్రెసిడెంట్​రమేశ్, డీవైపీఎం సత్యబోసు, ఆఫీస్ సూపరింటెండెంట్​ రాయలింగు తదితరులు పాల్గొన్నారు.