సింగరేణిలో సమ్మె సైరన్

సింగరేణిలో సమ్మె సైరన్

సింగరేణిలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. ప్రైవేటీకరణకు వ్యతిరేఖంగా, పలు డిమాండ్లను కూడా నెరవేర్చాలని కార్మికులు సమ్మెకు వెళ్తున్నారు.  సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (TBGKS) సింగరేణి యాజమాన్యానికి  ఇవాళ ( గురువారం) నోటీసులు కూడా ఇచ్చింది. డిసెంబర్ 9వ తేదీ నుంచి  సమ్మె చేయాలని  నిర్ణయించినట్లు కార్మిక సంఘం నేతలు తెలిపారు.  కోల్ ఇండియాలోని  89 బ్లాకులతో పాటు  సింగరేణిలోని నాలుగు బ్లాకులు.. కళ్యాణి ఖని బ్లాక్ 6, కొయ్య గూడెం బ్లాక్ 3,  సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణి పల్లి బ్లాకులను ప్రైవేటీకరించడాన్ని కార్మికులు వ్యతిరేకిస్తున్నారు.

అంతేకాదు.. అన్ ఫిట్ కార్మికుల డిపెండెంట్ల వయసును 35 నుంచి 40కి పెంచాలని.. మెడికల్ బోర్డును ఏర్పాటు చేయడంతో పాటు...ఆర్జిత లాభాలు కనుమరుగవుతాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.