సింగర్ మంగ్లీకి తృటిలో తప్పిన ప్రమాదం

 సింగర్ మంగ్లీకి తృటిలో తప్పిన ప్రమాదం

టాలీవుడ్  ప్రముఖ సింగర్ మంగ్లీకి తృటిలో ఘోర ప్రమాదం తప్పంది.  శంషాబాద్ వద్ద మంగ్లీ కారును డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో మంగ్లీతోపాటు మేనేజర్  మేఘ రాజు, మనోహర్ లు ఉన్నారు.  రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతి వనంలో ప్రపంచ ఆధ్యాత్మిక దినోత్సవానికి మంగ్లీ హాజరై తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది.  ఈ ఘటనలో మంగ్లీకి ఎలాంటి గాయలు కాలేదు.  మంగ్లీ కారును ఢీకొట్టిన డీసీఎం డ్రైవర్  మద్యం మత్తులో ఉన్నట్లుగా సమాచారం. ఈ ఘటనపై శంషాబాద్  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  డీసీఎం వాహనం ఢీ కొట్టడంతో మంగ్లీ కారు వెనుక భాగం బాగా దెబ్బతింది.  

ALSO READ | Harika Narayan: పెళ్లిచేసుకున్న సింగర్ హారిక నారాయణ్.. వరుడు ఎవరో తెలుసా?