జూబ్లీహిల్స్, వెలుగు: సింగర్ మంగ్లీని అసభ్యగా దూషిస్తూ సోషల్ మీడియాలో వీడియా పోస్ట్ చేసిన వ్యక్తిని పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల సింగర్ మంగ్లీ బాయిలోనే బల్లి పలికే అనే పాట యూట్యూబ్లో రిలీజ్ చేసింది. ఇదే పాటను మల్లికార్జున్(మేడిపల్లి స్టార్) తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి, ఆమెను అసభ్య పదజాలం దూషించాడు. ఎస్సార్ నగర్ కు చెందిన మంగ్లీ అభిమాని గోవింద్ అతనిపై ఫిర్యాదు చేయడంతో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
