జాన్సన్ అండ్ జాన్సన్ నుంచి సింగిల్ డోస్ వ్యాక్సిన్

జాన్సన్ అండ్ జాన్సన్ నుంచి సింగిల్ డోస్ వ్యాక్సిన్

కరోనా వైరస్ ను అరికట్టేందుకు పలు దేశాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. పలు ఫార్మా కంపెనీలకు సంబంధించిన వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయి. మరిన్ని కంపెనీలు కూడా వ్యాక్సిన్ తయారీలో తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ప్రస్తుతానికి వేస్తున్న వ్యాక్సిన్లు రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉండగా.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ లేటెస్టుగా సింగిల్ డోస్ వ్యాక్సిన్ ను తీసుకొస్తోంది. జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ను అత్యవసర వినియోగానికి అనుమతి ఇస్తూ, అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాలు జారీ చేసింది.

ఈ వ్యాక్సిన్ కరోనా కొత్త స్ట్రెయిన్ల మీద కూడా సమర్ధవంతంగా పని చేస్తున్నట్టు తేలింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతోషం వ్యక్తం చేశారు.అంతేకాదు ప్రజలు అలర్ట్ గా ఉండాలని…మాస్క్ ధరించకుండా ఉండవద్దని అన్నారు. కరోనాపై పూర్తిగా విజయం సాధించేంత వరకూ జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలని సూచించారు.