‘సార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడంటే

‘సార్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎక్కడంటే

తమిళ స్టార్​ హీరో ధనుష్ ‘సార్’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కింది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 17న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌‌ జోరు పెంచింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈ వెంట్​ను ఈ నెల 15న హైదరాబాద్ .. నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఈ సినిమాలో ధనుష్​ లెక్చరర్ గా నటించాడు.. మీనాక్షి పాత్రలో సంయుక్త మీనన్ కనిపించనుంది. సాయికుమార్, తనికెళ్ల భ‌‌ర‌‌ణి, సముద్ర ఖని ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. కాలేజ్ నేపథ్యంలో విద్యా వ్యవస్థను కొంతమంది వ్యక్తులు ఎలా బిజినెస్ గా మారుస్తున్నారనే అంశాలపై ఈ కథ నడుస్తుంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం సమకూర్చారు.