అర్హుల పేర్లు పోకుండా జాగ్రత్త పడాలి.. SIR ప్రక్రియ పారదర్శకంగా జరగాలి

అర్హుల పేర్లు పోకుండా జాగ్రత్త పడాలి.. SIR ప్రక్రియ పారదర్శకంగా జరగాలి
  •     ఎంపీ అనిల్‌‌‌‌‌‌‌‌కుమార్ యాదవ్

ఉప్పల్/పద్మారావునగర్​, వెలుగు: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌‌‌‌‌‌‌‌ఐఆర్) ప్రక్రియ ప్రజలకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా జరిగేలా బీఎల్‌‌‌‌‌‌‌‌ఏలు అప్రమత్తంగా ఉండాలని రాజ్యసభ సభ్యుడు అనిల్‌‌‌‌‌‌‌‌కుమార్ యాదవ్ సూచించారు. 

ఆదివారం ఉప్పల్‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి పరమేశ్వర్ రెడ్డి, లాలాపేట్‌‌‌‌‌‌‌‌లో నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి ఆదం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో సర్‌‌‌‌‌‌‌‌పై బీఎల్‌‌‌‌‌‌‌‌ఏలకు అవగాహన సదస్సు నిర్వహించారు. 

ఈ సదస్సులో అనిల్‌‌‌‌‌‌‌‌కుమార్ యాదవ్‌‌‌‌‌‌‌‌తో పాటు మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్​యాదవ్, నియోజకవర్గ కోఆర్డినేటర్ ఇందిర శోభన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అవగాహన కల్పించి ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేసుకునేలా చూడాలని బూత్ లెవల్ ఏజెంట్లకు సూచించారు. రఘురాం రెడ్డి, దీపక్ జాన్, కాల్వ సుజాత పాల్గొన్నారు.

బీఎల్‌‌‌‌‌‌‌‌ఏల పాత్ర కీలకం..

ఇబ్రహీంపట్నం: సర్​ ప్రక్రియలో బీఎల్​ఏల పాత్ర కీలకమని పీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగ్లూర్‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్ బీఎల్​ఏలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్‌‌‌‌‌‌‌‌కుమార్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌‌‌‌‌‌‌‌రెడ్డి రంగారెడ్డితో కలిసి రామ్మోహన్​రెడ్డి మాట్లాడారు. ఓటరు జాబితా ప్రక్రియను పారదర్శకంగా, సమర్థంగా నిర్వహించాలన్నారు.