సిరాజ్‌ వర్సెస్ ఇషాంత్.. సెకండ్‌‌‌‌ పేసర్‌‌‌‌ బెర్త్‌‌‌‌ కోసం పోటాపోటీ

సిరాజ్‌ వర్సెస్ ఇషాంత్.. సెకండ్‌‌‌‌ పేసర్‌‌‌‌ బెర్త్‌‌‌‌ కోసం పోటాపోటీ

ఏడాదిగా రెడ్ బాల్‌‌‌‌కు దూరంగా లంబూ

ఆసీస్‌‌‌‌పై అదరగొట్టి జోష్‌‌‌‌లో హైదరాబాద్​ యంగ్​స్టర్​

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా టూర్‌‌‌‌లో టీమిండియాను గాయాలు వేధించాయి. పలువురు సీనియర్‌‌‌‌ బౌలర్లు ఇంజ్యురీస్‌‌‌‌తో ఫీల్డ్‌‌‌‌కు దూరమైన వేళ.. యంగ్‌‌‌‌ బౌలర్లు టీమ్‌‌‌‌లోకి వచ్చారు. అందివచ్చిన అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకొని అదిరిపోయే పెర్ఫామెన్స్‌‌‌‌ చేశారు. కంగారూల గడ్డపై హిస్టారికల్‌‌‌‌ విక్టరీలో భాగమయ్యారు. ఇప్పుడు  స్వదేశంలో ఇంగ్లండ్‌‌‌‌తో టెస్టు సిరీస్‌‌‌‌లోనూ సత్తా చాటేందుకు రెడీ అయ్యారు.  నాలుగు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో భాగంగా చెన్నై చెపాక్‌‌‌‌ స్టేడియం వేదికగా శుక్రవారం తొలి టెస్టు మొదలవనుంది. అయితే, ఆసీస్‌‌‌‌ గడ్డపై ప్లేయర్ల ఇంజ్యురీలు తలనొప్పిగా మారగా.. తాజా సిరీస్‌‌‌‌లో ఫైనల్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌కు ప్లేయర్ల మధ్య పోటీ పెరగడం మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌కు సమస్య అయింది. ముఖ్యంగా సెకండ్‌‌‌‌ పేసర్‌‌‌‌ కోటాలో వెటరన్‌‌‌‌ పేసర్‌‌‌‌ ఇషాంత్‌‌‌‌ శర్మ, యువ సంచలనం మహ్మద్‌‌‌‌ సిరాజ్ మధ్య గట్టి పోటీ ఉంది. ఈ సిరీస్‌‌‌‌లో లంబూతో కలిసి బౌలింగ్‌‌‌‌ చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని సిరాజ్‌‌‌‌ చెప్పాడు. కానీ, ఇప్పుడున్న సిచ్యువేషన్‌‌‌‌, పిచ్‌‌‌‌ స్వభావాన్ని బట్టి తొలి టెస్టులో అది సాధ్యం అయ్యేలా లేదు. ఈ ఇద్దరిలో ఒక్కరే ఫైనల్‌‌‌‌ టీమ్‌‌‌‌లో ఉండే చాన్సుంది. ఎందుకంటే చెన్నై చెపాక్‌‌‌‌ వికెట్‌‌‌‌ స్పిన్‌‌‌‌కు స్వర్గధామం. కాబట్టి ఈ పోరులో ఇండియా ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. ‘ఇది టిపికల్‌‌‌‌ చెపాక్‌‌‌‌ వికెట్‌‌‌‌.  ఇక్కడ ఇంగ్లిష్‌‌‌‌ ఫీల్‌‌‌‌ లాంటివి ఏమీ లేవు. ఈ హ్యుమిడిటీలో పిచ్​పై త్వరగా పగుళ్లు రాకుండా ఉండేందుకు కాస్త గ్రాస్‌‌‌‌ ఉంచాలి. వికెట్‌‌‌‌ ఎప్పట్లాగే స్పిన్నర్లకు సపోర్ట్‌‌‌‌ ఇస్తుంది’ అని మ్యాచ్‌‌‌‌ పర్యవేక్షణలో ఉన్న బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు.  ఈ లెక్కన స్పిన్‌‌‌‌ అటాక్‌‌‌‌తో ఇంగ్లండ్‌‌‌‌ను పడగొట్టేందుకు ఇండియా ప్లాన్స్‌‌‌‌ రెడీ చేస్తోందని అర్థం చేసుకోవచ్చు. ప్రధాన పేసర్‌‌‌‌గా జస్‌‌‌‌ప్రీత్‌‌‌‌ బుమ్రా టీమ్‌‌‌‌లో ఉండడం ఖాయం. అతని పార్ట్‌‌‌‌నర్‌‌‌‌గా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంలో అందరి కళ్లూ హెడ్‌‌‌‌ కోచ్‌‌‌‌ రవిశాస్త్రి, బౌలింగ్‌‌‌‌ కోచ్‌‌‌‌ భరత్‌‌‌‌ అరుణ్‌‌‌‌, కెప్టెన్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీపైనే ఉన్నాయి. గాయంతో ఆసీస్‌‌‌‌తో ఫోర్త్‌‌‌‌ టెస్టుకు దూరమైన బుమ్రా పూర్తిగా కోలుకున్నాడు. సోమవారం జరిగిన ఫస్ట్‌‌‌‌ ఔట్‌‌‌‌డోర్‌‌‌‌ సెషన్‌‌‌‌తో పాటు మంగళవారం నెట్‌‌‌‌ సెషన్‌‌‌‌లోనూ పాల్గొన్నాడు.

సిరాజ్‌‌‌‌‌‌‌‌కే మొగ్గు

ఇప్పుడున్న పరిస్థితుల్లో బుమ్రాకు తోడుగా పేస్‌‌‌‌‌‌‌‌ బాధ్యతలు పంచుకునేందుకు సిరాజ్‌‌‌‌‌‌‌‌కే కాస్త మొగ్గుంది. ఎందుకంటే 32 ఏళ్ల ఇషాంత్‌‌‌‌‌‌‌‌ రెడ్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ ఆడి ఏడాది అవుతోంది. గాయం నుంచి కోలుకున్నా ఫుల్‌‌‌‌‌‌‌‌ ఫిట్‌‌‌‌‌‌‌‌నెస్‌‌‌‌‌‌‌‌ లేకపోవడంతో  ఆసీస్‌‌‌‌‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌కు దూరమైన అతను సయ్యద్‌‌‌‌‌‌‌‌ ముస్తాక్‌‌‌‌‌‌‌‌ అలీ ట్రోఫీతో రీఎంట్రీ ఇచ్చాడు. ఆ టోర్నీలో నాలుగు మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు ఆడిన లంబూ కేవలం 14.1 ఓవర్లు మాత్రమే బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఈ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌తో అతడిని ఫస్ట్‌‌‌‌‌‌‌‌ టెస్టుకు ఎంపిక చేసే అవకాశాలు లేవని పలువురు భావిస్తున్నారు. మరోవైపు 26 ఏళ్ల సిరాజ్‌‌‌‌‌‌‌‌ ఆసీస్‌‌‌‌‌‌‌‌పై అదరగొట్టి ఫుల్‌‌‌‌‌‌‌‌ జోష్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాడు. మహ్మద్‌‌‌‌‌‌‌‌ షమీ గాయపడడంతో ఆసీస్‌‌‌‌‌‌‌‌తో చివరి మూడు టెస్టుల్లో ఆడిన అతను అద్భుతంగా బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేశాడు. నాలుగో టెస్టులో  బౌలింగ్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ను కూడా లీడ్‌‌‌‌‌‌‌‌ చేశాడు. బ్రిస్బేన్‌‌‌‌‌‌‌‌లో ఫైవ్‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌ హాల్‌‌‌‌‌‌‌‌ సహా  సిరీస్‌‌‌‌‌‌‌‌లో 13 వికెట్లతో ఇండియా నుంచి టాప్‌‌‌‌‌‌‌‌ వికెట్‌‌‌‌‌‌‌‌ టేకర్‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. అంత గొప్ప పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ తర్వాత ఈ యంగ్ క్రికెటర్‌‌‌‌‌‌‌‌ను బెంచ్‌‌‌‌‌‌‌‌పై కూర్చోబెట్టే సాహసం మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ చేయకపోవచ్చు. మరోవైపు స్పిన్‌‌‌‌‌‌‌‌ కోటాకు కూడా గట్టి పోటీనే ఉంది. సీనియర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ రవిచంద్రన్‌‌‌‌‌‌‌‌ అశ్విన్‌‌‌‌‌‌‌‌ స్పిన్‌‌‌‌‌‌‌‌ అటాక్‌‌‌‌‌‌‌‌ను లీడ్‌‌‌‌‌‌‌‌ చేయడం ఖాయం.  మిగతా రెండు ప్లేస్‌‌‌‌‌‌‌‌లకు ఫామ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌ సుందర్‌‌‌‌‌‌‌‌, చైనామన్‌‌‌‌‌‌‌‌ కుల్దీప్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌, టెస్టు టీమ్‌‌‌‌‌‌‌‌ నుంచి పిలుపు అందుకున్న లెఫ్టార్మ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ అక్షర్‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌ పోటీ పడుతున్నారు. ఆసీస్‌‌‌‌‌‌‌‌లో ఒక్క మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో అవకాశం రాని కుల్దీప్‌‌‌‌‌‌‌‌ను ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌పై బరిలోకి దింపే చాన్స్‌‌‌‌‌‌‌‌ కనిపిస్తోంది. తను బరిలో ఉంటే స్పిన్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌లో వైవిధ్యం కూడా వస్తుంది. అప్పుడు మూడో స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ కూడా అవసరం అయితే  సుందర్‌‌‌‌‌‌‌‌, అక్షర్‌‌‌‌‌‌‌‌ మధ్య పోటీ ఉంటుంది. ఆసీస్‌‌‌‌‌‌‌‌పై తన అరంగేట్రం మ్యాచ్‌‌‌‌‌‌‌‌లోనే సుందర్‌‌‌‌‌‌‌‌  హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీ చేయడంతో పాటు నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు.  కానీ, అక్షర్‌‌‌‌‌‌‌‌ను తీసుకుంటే మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌లో బ్యాట్స్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌గా పనికొస్తాడని విశ్లేషకులు భావిస్తున్నారు. గాయపడ్డ ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ రవీంద్ర జడేజాకు తను సరైన రీప్లేస్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అన్న అభిప్రాయాలున్నాయి.

 

ఒకరు వెటరన్‌‌ ప్లేయర్‌‌. ఎన్నో మ్యాచ్‌‌ల్లో ప్రత్యర్థులను గడగడలాడించిన పేసర్‌‌. ఇంటా బయటా టీమ్‌‌ సాధించిన ఎన్నో విజయాల్లో పాలు పంచుకున్న బౌలర్‌‌.  ఇంకోకరు యంగ్‌‌స్టర్‌‌. తన ఫస్ట్‌‌ సిరీస్‌‌లోనే సత్తా చాటిన స్పీడ్‌‌స్టర్‌‌. కంగారూల గడ్డపై హిస్టారికల్‌‌ టెస్టు సిరీస్‌‌ విక్టరీలో ఇండియా తరఫున హయ్యెస్ట్‌‌ వికెట్‌‌ టేకర్‌‌. ఈ ఇద్దరూ ఇప్పుడు సొంతగడ్డపై ఇంగ్లండ్‌‌తో జరిగే టెస్టు సిరీస్‌‌లో సెకండ్‌‌ పేసర్‌‌ బెర్తు కోసం పోటీ పడుతున్నారు. వాళ్లే సీనియర్‌‌ ఇషాంత్‌‌ శర్మ, జూనియర్‌‌ మహ్మద్‌‌ సిరాజ్‌‌. మరో రెండు రోజుల్లో ఫస్ట్‌‌ టెస్టు మొదలవనుండగా.. జస్‌‌ప్రీత్‌‌ బుమ్రాకు తోడుగా ఈ ఇద్దరిలో ఎవరిని బరిలోకి దింపుతారన్నది ఇప్పుడు హాట్‌‌ టాపిక్‌‌గా మారింది.

హార్దిక్‌‌‌‌ తొలి మ్యాచ్‌‌‌‌కు డౌటే

స్టార్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ హార్దిక్‌‌‌‌ పాండ్యా తొలి మ్యాచ్‌‌‌‌లో బరిలోకి దిగే అవకాశం కనిపించడం లేదు. వరల్డ్‌‌‌‌ టెస్ట్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌, ఇంగ్లండ్‌‌‌‌లో ఐదు టెస్టుల సిరీస్‌‌‌‌లో బౌలింగ్‌‌‌‌ వర్క్‌‌‌‌లోడ్‌‌‌‌ పెంచుకోవాల్సిన దృష్ట్యా ఫస్ట్‌‌‌‌ టెస్టులో అతనికి రెస్ట్‌‌‌‌ ఇవ్వాలని మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ భావిస్తున్నట్టు సమాచారం. పైగా  వ్యక్తిగత పని వల్ల అతను ఒక రోజు ఆలస్యంగా చెన్నైలో టీమ్‌‌‌‌తో జాయిన్‌‌‌‌ అయ్యాడు. అతని క్వారంటైన్‌‌‌‌ బుధవారం ఉదయం పూర్తి కానుండగా.. అదే రోజు నుంచి ప్రాక్టీస్‌‌‌‌లో పాల్గొంటాడు.

For More News..

ఐసీసీ అవార్డు రేసులో పంత్

ఆల్​టైమ్​ హై సమీపంలో ఇండెక్స్​లు

మా బండ్లలో డీజిల్ పోయిస్తే.. నీ బిడ్డను వెతుకుతం

ఆరుసార్లు జాక్‌‌‌‌పాట్‌‌‌‌ కొట్టిన అదృష్టవంతుడు