అట్టహాసంగా నిరి9 అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేడుకలు

అట్టహాసంగా నిరి9 అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేడుకలు

నిరి9 అంతర్జాతీయ చలనచిత్రోత్సవం మూడవ ఎడిషన్ కార్యక్రమం సోమవారంతో ముగిసింది. ఈ వేడుకలో  ఫీచర్ ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలకు వివిధ కేటగిరీల్లో అవార్డులను అందజేశారు.  అస్సామీ చలనచిత్రం ‘జూయిఫూల్’ అత్యంత ప్రతిష్టాత్మకమైన డాక్టర్ జుబీన్‌‌ గార్గ్ మెమోరియల్ ఉత్తమ చలనచిత్ర అవార్డును అందుకోగా,  దహిని-ది విచ్ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా రాజేష్ టచ్‌‌రివర్ పురస్కారం అందుకున్నారు. 

ఉత్తమ ఫీచర్ ఫిల్మ్: జుయ్‌‌ఫూల్,  రెండవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్: ఘర్,  మూడవ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్: దాహిని – ది విచ్,  జ్యూరీ ప్రత్యేక అవార్డు: కుహిపాత్,  ఉత్తమ నటుడు (మేల్): బిష్ణుఖర్గోరియా (ఆకాష్హేనునోదిర్ నామ్),  ఉత్తమ నటి (ఫిమేల్): ఆకాంక్ష యాదవ్ (ఘర్) అవార్డులను అందుకున్నారు.  

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  దాన కిషోర్,  తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సి ప్రియాంక హాజరయ్యారు. వీరితోపాటు  దర్శకులు వీఎన్ ఆదిత్య, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.