కరోనా ఎఫెక్ట్: తమ్మున్ని వెయిట్ లిఫ్ట్‌గా చేసి అక్క వ్యాయామం

కరోనా ఎఫెక్ట్: తమ్మున్ని వెయిట్ లిఫ్ట్‌గా చేసి అక్క వ్యాయామం

కరోనా ఎఫెక్ట్‌తో ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. అయితే క్రమం తప్పకుండా జిమ్ చేసేవారికి, ఇంట్లో జిమ్ పరికరాలు లేని వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయంపై హిందీ టీవీనటి శ్వేతా తివారి తన కూతురు పాలక్ చేసిన ఓ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. అయితే అందులో పాలక్ తన ఐదు సంవత్సరాల   తమ్ముడు రియాన్షు ఉపయోగించి వెయిట్ లిఫ్ట్ ఎక్సర్‌సైజ్ చేసింది. అయితే ముందుగా తను రియాన్షు ఎత్తుకుని బైసెప్స్ ఎక్సర్‌సైజ్ చేసింది. దీంతో పాటు… చిన్న బాబు లేక కుక్కతో కూడా వ్యాయామం చేయవచ్చని తెలిపింది. అయితే ముందుగా బాబుకు కంఫర్ట్ ఉండేలా చూసుకోవడం ముఖ్యమని తెలిపింది.

ఈ వీడియోను శ్వేత తన సోషల్ మీడియా ఎకౌంట్‌లో పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా రిప్లే ఇస్తున్నారు. నటుడు అమిత్ పటేల్ కామెంట్ చేస్తూ రియాన్షును తన దగ్గరికి పంపాలని జిమ్ చేశాక తిరిగి పంపిస్తానని అన్నాడు.  అంతకు ముందురోజు శ్వేతా తన కొడుకుకు హెయిర్ కట్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.

శ్వేతకు 1998లో రాజు చౌధరితో మొదటగా పెండ్లి జరిగింది. వారి సంతానం 19ఏళ్ల పాలక్. అయితే రాజు చౌధరితో పలు వివాదాల కారణంగా 2007లో విడాకులు తీసుకుంది. 2013లో శ్వేత నటుడు అభినవ్ కోహ్లీని వివాహం చేసుకుంది. వారి కొడుకే రియాన్షు.

 

 

https://www.instagram.com/p/B-rRvZBJxwX/