
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సృష్టి కేసులో నిందితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తీగ లాడితే డొంక కదిలినట్లు ఒకరి తర్వాత ఒకరు ఈ కేసుకు లింకప్ అయినవారు లీలలు బయటపడుతూనే ఉన్నాయి. ఈ కేసులో దర్యాప్తు వేగం పెంచిన సిట్.. సోమవారం (సెప్టెంబర్ 01) మరో ఇద్దరిని జ్యుడీషియల్ కస్టడీ కో కోరుతూ పిటిషన్
సృష్టి కేసులో నిందితుల సంఖ్య పెరుగుతూనే ఉంది.. మరో ఇద్దరిని కస్టడీ కోరుతూ కోర్టులో సిట్ పిటిషన్ వేసింది పిట్. ఈ ఘటనలో ఇప్పటికే 9 కేసులు నమోదు చేసిన సిట్.. మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తోంది. కేసులో ఇంకెంత మంది ఉన్నారనే దానిపై విచారణ జరుపుతోంది.
యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం సరోగసీ ముసుగులో శిశువిక్రయాలకు పాల్పడుతోందని నిర్ధారించిన పోలీసులు.. ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతతో పాటు 27 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడు జయంత కృష్ణలు కీలక నిందితులు
ఇదిలా ఉండగా మరో ఇద్దరు నిందితులను జ్యుడీషియల్ కస్టడీ కోరింది సిట్. సదానందం, చెన్నారావులను 2 రోజులు పోలీసు కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు.