చీకోటి ప్రవీణ్‌‌కు సిట్‌‌ పిలుపు...ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో నోటీసులు జారీ

చీకోటి ప్రవీణ్‌‌కు సిట్‌‌ పిలుపు...ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో నోటీసులు జారీ

హైదరాబాద్‌‌, వెలుగు : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ అధికార ప్రతినిధి చీకోటి ప్రవీణ్‌‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 12.30  గంటలకు బషీర్‌‌‌‌బాగ్‌‌లోని ఓల్డ్‌‌ కమిషనరేట్‌‌లో గల సిట్ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని సూచించింది. ఈ మేరకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి చీకోటి ప్రవీణ్ ఫోన్‌‌ నంబర్‌‌‌‌ ట్యాపింగ్‌‌లో ఉన్నట్లు సిట్‌‌ గుర్తించింది. 

సాక్షుల స్టేట్‌‌మెంట్‌‌ రికార్డ్‌‌లో భాగంగా చీకోటికి నోటీసులు ఇచ్చింది. కాగా తన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు గతంలోనే చికోటి డీజీపీకి ఫిర్యాదు చేశాడు. నాటి సిటీ టాస్క్‌‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు తన ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే సిట్‌‌ సేకరించిన  ఫోన్ ట్యాపింగ్‌‌ లిస్టులో చీకోటి ప్రవీణ్‌‌ ఫోన్ నంబర్​ను‌‌ అధికారులు గుర్తించారు.