12 ఏళ్ల మోదీ పాలన ఆదర్శనీయం : ఎమ్మెల్సీ మల్క కొమురయ్య

12 ఏళ్ల మోదీ పాలన ఆదర్శనీయం : ఎమ్మెల్సీ మల్క కొమురయ్య

రాజన్న సిరిసిల్ల, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన ఆదర్శవంతంగా సాగుతోందని టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య కొనియాడారు. మోదీ 12 ఏళ్ల పాలన విజయోత్సవాల సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో సిరిసిల్లలోని వాసవి కల్యాణ మండపంలో గురువారం మీడియాతో మాట్లాడారు. మోదీ పాలన మచ్చలేని, ఆదర్శవంతమైన పాలన అని అన్నారు. 2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 18వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం మూడో స్థానానికి చేరుకుందని తెలిపారు.

తెలంగాణలో బీజేపీ సర్కారు రావడం ఖాయం

కోరుట్ల: తెలంగాణలో బీఆర్ఎస్​, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లకు  బలమైన శక్తిగా బీజేపీ ఎదగుతోందని, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ సర్కారు రావడం  ఖాయమని మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్​ ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని  మోదీ 12 ఏండ్ల పాలన సందర్భంగా గురువారం రాత్రి జగిత్యాల జిల్లా  కోరుట్లలో ‘వికసిత్ భారత్’పై --మేధావుల సదస్సు నిర్వహించారు.  ఆసిఫాబాద్ ఎమ్మెల్యే పల్వాయి హరీశ్‌‌‌‌‌‌‌‌, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్ప, బీజేపీ  జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అనూప్ రావు, పూదరి అరుణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.