ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత... భక్తిభావం వలన సానుకూల శక్తి పెరుగుతుంది

ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత... భక్తిభావం వలన సానుకూల శక్తి పెరుగుతుంది
  •     నీలం మధు ముదిరాజ్

పటాన్​చెరు, వెలుగు: ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత లభిస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌‌‌‌చార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని జ్యోతిరావు పూలే కాలనీలో శ్రీ విజయదుర్గా పెద్దమ్మ తల్లి ఆలయంలో శ్రీ శివ పంచాయతన సహిత నవగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం గురువారం  ఘనంగా నిర్వహించారు. మాజీ కౌన్సిలర్ కొల్లూరి భరత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవంలో నీలం మధు ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  

జూన్ 16 నుంచి 18వరకు మూడు రోజుల పాటు వేద పండితుల ఆధ్వర్యంలో వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తిభావం సానుకూల శక్తిని పెంపొందిస్తుందన్నారు. 

ఆలయ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని విజయవంతం చేసిన ఫౌండర్స్ కొల్లూరి అమృత–సత్తయ్య దంపతులు, కొల్లూరి భరత్, ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో చిన్న శ్రీశైలం యాదవ్, మాజీ కార్పొరేటర్ పుష్ప నగేశ్‌‌‌‌ యాదవ్, పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, డాకూర్ రాంమోహన్ రెడ్డి, లింగం, మధుసూదన్, రవిచారి, పాండు పాల్గొన్నారు.