ఏసీబీకి చిక్కిన బొల్లారం విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏఈ

ఏసీబీకి చిక్కిన బొల్లారం విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏఈ

 

  •     ఇటీవల ఓ కరెంట్ పోల్ ను ఢీకొట్టిన కారు
  •     కేసు కాకుండా చూసుకునేందుకు రూ. 25 వేలు డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన ఏఈ

జిన్నారం, వెలుగు : కారు స్తంభాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో కేసు కాకుండా చూసేందుకు రూ. 25 వేలు తీసుకున్న సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారం విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శాఖ ఏఈ రామకృష్ణారెడ్డిని ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హ్యాండెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పట్టుకున్నారు. ఏసీబీ ఆఫీసర్లు తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 12న ఓ కారు అదుపు తప్పి బొల్లారంలోని పీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సమీపంలో విద్యుత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్తంభాన్ని ఢీకొట్టింది. స్తంభం విరిగిపోవడంతో కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేశారు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసు కేసు కాకుండా చూసేందుకు కారు ఓనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి బొల్లారం ఏఈ రామకృష్ణారెడ్డి రూ. 25 వేలు డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనతో గురువారం మధ్యాహ్నం ఏఈని కలిసి డబ్బులు ఇచ్చాడు. అప్పటికే అక్కడికి వచ్చిన ఏసీబీ ఆఫీసర్లు ఏఈ రామకృష్ణారెడ్డిని రెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హ్యాండెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పట్టుకున్నారు. అనంతరం బొల్లారం సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తనిఖీలు నిర్వహించారు. ఏఈని అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చేసి ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నట్లు ఆఫీసర్లు తెలిపారు.