- ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్లతోనే పేదలకు న్యాయం జరుగుతోందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో పదేండ్లపాటు అబద్ధపు హామీలిచ్చి ప్రజలను మోసగించిందని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
మహబూబ్‌నగర్ రూరల్ మండలం రామచంద్రాపురం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను, రూ.5 లక్షల ఉపాధి హామీ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డును బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం అల్లీపూర్ గ్రామంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ ట్రైనింగ్ స్థలాన్ని రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించి పనులను త్వరగా ప్రారంభించాలని ఆదేశించారు.
