లక్ష్మణ మూర్తి రతన, భ్రమరాంబిక తూటిక జంటగా నటించిన చిత్రం ‘సీతారాం సిత్రాలు’. డి. నాగ శశిధర్ రెడ్డి దర్శకత్వం వహిస్తూ పి. పార్థసారథి, కృష్ణ చంద్ర విజయబట్టులతో కలిసి నిర్మించారు. ఆగస్టు 30న సినిమా విడుదల కానుంది. శనివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. గెస్ట్‌గా హాజరైన హీరో ఆకాష్ జగన్నాథ్ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశాడు.
లక్ష్మణ మూర్తి మాట్లాడుతూ ‘గుడికి వెళితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ సినిమా చూస్తే అంతే ప్రశాంతంగా ఉంటుంది’ అని చెప్పాడు. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పింది హీరోయిన్ భ్రమరాంబిక. స్ట్రెస్ రిలీఫ్‌లా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు నాగ శశిధర్ అన్నాడు. ఈ చిన్న సినిమాని ఆదరించి పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా అని నిర్మాతలు అన్నారు.