ఇఫ్లూలో కెనడియన్​.. వర్సిటీ టీమ్ పర్యటన

ఇఫ్లూలో కెనడియన్​.. వర్సిటీ టీమ్ పర్యటన

ఓయూ, వెలుగు : కెనడాలోని ఒంటారియో వెస్ట్రన్ యూనివర్సిటీ ప్రతినిధి బృందం మంగళవారం ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)ని సందర్శించింది. వెస్ట్రన్ వర్సిటీ ప్రెసిడెంట్, వైస్ చాన్స్ లర్ అలాన్ షెపర్డ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యులు ఇఫ్లూ వీసీ ప్రొఫెసర్ సురేశ్ కుమార్, అకడమిక్​, పరిపాలన డీన్​లతో భేటీ అయ్యారు. ఇఫ్లూలో సహకార పరిశోధన, ఉమ్మడి ప్రచురణలు, విద్యార్థి, అధ్యాపకుల మార్పిడి కార్యక్రమాల నిర్వహణకు కెనడియన్ ప్రతినిధి బృందం అంగీకారం తెలిపింది.

అంతరించిపోతున్న  దేశీయ భాషలపై దృష్టి కేంద్రీకరించి ఆయా భాషల్లో ఇఫ్లూతో కలిసి పరిశోధనలు జరిపేందుకు  ఆసక్తి చూపింది. పరిశోధనలతో స్టూడెంట్లకు అంతర్జాతీయంగా అవకాశాలు మెరుగుపడతాయని ఇఫ్లూ వీసీ ప్రొఫెసర్​సురేశ్​ కుమార్ పేర్కొన్నారు. కెనడియన్ టీమ్​లో  వెస్ట్రన్ వర్సిటీ వైస్ ప్రెసిడెంట్ లిల్లీ చో, ఇంజినీరింగ్ డీన్ కెన్ కోలీ ఉన్నారు.