శివ కార్తికేయన్ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్.. మదరాసి ట్రైలర్‌‌‌‌‌‌‌‌ లోడింగ్..

శివ కార్తికేయన్ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్.. మదరాసి ట్రైలర్‌‌‌‌‌‌‌‌ లోడింగ్..

శివ కార్తికేయన్, రుక్మిణీ వసంత్ జంటగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ ‘మదరాసి’.  సెప్టెంబర్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్.  ఇప్పటికే టీజర్‌‌‌‌‌‌‌‌తో మంచి బజ్‌‌‌‌ని క్రియేట్ చేశారు. ఆగస్టు 24న  ట్రైలర్‌‌‌‌‌‌‌‌తో పాటు ఆడియో లాంచ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించనున్నట్టు ప్రకటించారు. 

ఇందులో శివకార్తికేయన్‌‌‌‌ కంప్లీట్ మాస్ లుక్‌‌‌‌లో కనిపించనున్నాడు.  ట్రైలర్ అనౌన్స్‌‌‌‌మెంట్ పోస్టర్‌‌‌‌లో శివకార్తికేయన్‌‌‌‌తో పాటు విద్యూత్ జమ్మ్వాల్, బిజు మీనన్, విక్రాంత్‌‌‌‌లను కూడా ఇంటెన్స్ లుక్‌‌‌‌లో ప్రజెంట్ చేశారు.  శ్రీలక్ష్మీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని  గ్రాండ్ స్కేల్‌‌‌‌లో  నిర్మిస్తోంది.