మహావీరుడు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది : శివ కార్తికేయన్

మహావీరుడు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది : శివ కార్తికేయన్

శివ కార్తికేయన్ హీరోగా ‘మండేలా’ ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ  చిత్రం ‘మా వీరన్’. దర్శకుడు శంకర్ కూతురు అదితి హీరోయిన్‌‌. యోగి బాబు, సునీల్, మిస్కిన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.  అరుణ్‌‌ విశ్వ నిర్మిస్తున్నారు. తెలుగులో ‘మహావీరుడు’ పేరుతో జులై 14న ఏషియన్ సినిమాస్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఇటీవల హైదరాబాద్‌‌లో ప్రీ రిలీజ్‌‌ ఈవెంట్ నిర్వహించారు. 

ముఖ్య అతిథులుగా హాజరైన  హీరో అడివి శేష్, డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. శివ కార్తికేయన్ మాట్లాడుతూ ‘ఇదొక ఫాంటసీ జానర్. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. దర్శకుడు అశ్విన్ బ్రిలియంట్‌‌గా తీశారు. మంచి  సర్‌‌ప్రైజ్ కూడా ఉంది. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పాడు. తనకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పింది అదితి.  

మడోన్ అశ్విన్ మాట్లాడుతూ ‘శివకార్తికేయన్ గ్రేట్ పెర్ఫార్మర్. ఇందులో ఆయన నటనతో పాటు యాక్షన్ యాంగిల్ కూడా చూస్తారు’ అని అన్నాడు. ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న సునీల్ నారంగ్‌‌ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు నిర్మాత అరుణ్ విశ్వ. సరిత, అనుదీప్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.