గండిపేట, వెలుగు: అత్తాపూర్–ఆరాంఘర్ రహదారిపై ప్రమాదకర బైక్ స్టంట్లతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఆరుగురు యువకులను రాజేంద్రనగర్ టాస్క్‌ఫోర్స్, అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు బైక్‌లు, ఆరు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన వారిలో హసన్‌నగర్‌కు చెందిన సయ్యద్ షాహెద్, షేక్ నసీర్హుస్సేన్, షేక్ జునైద్, కాలాపత్తర్‌కు చెందిన బిన్ ఇసా, అబ్దుల్ సమద్, అర్బాజ్ హుస్సేన్ ఖాన్ ఉన్నారు. వీరిపై గతంలోనూ బహదూర్‌పురా, అత్తాపూర్ స్టేషన్లలో బైక్ స్టంట్లు, పోక్సో కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
