ఆరు దేశాల పాస్‌‌పోర్టులు పవర్‌‌‌‌ఫుల్

ఆరు దేశాల పాస్‌‌పోర్టులు పవర్‌‌‌‌ఫుల్
  • ఫస్ట్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌లో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్‌‌‌‌
  • ఈ దేశాల వారికి 194 దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ
  • 80వ ర్యాంకులో ఇండియా.. 62 దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ

న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన పాస్‌‌‌‌పోర్టుల లిస్టును హెన్లీ పాస్‌‌‌‌పోర్ట్‌‌‌‌ ఇండెక్స్ రిలీజ్ చేసింది. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ దేశాల పాస్‌‌‌‌పోర్టులు.. 2024లో మోస్ట్ పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌ అని వెల్లడించింది. ఈ దేశాల పాస్‌‌‌‌పోర్టులు ఉన్న వారికి 194 దేశాలల్లో వీసా ఫ్రీ ఎంట్రీ ఉంటుందని తెలిపింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌‌‌‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) డేటా ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చింది. గత ఐదేండ్లుగా జపాన్, సింగపూర్‌‌‌‌‌‌‌‌ దేశాలు మాత్రమే తొలి స్థానంలో ఉండేవి. అయితే తాజా ర్యాంకింగ్స్‌‌‌‌లో కొన్ని యూరోపియన్ దేశాలు టాప్‌‌‌‌లోకి వచ్చాయి. ఇక ఫిన్లాండ్, స్వీడన్, సౌత్ కొరియా దేశాలు రెండో స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్‌‌‌‌పోర్టులతో 193 డెస్టినేషన్లకు వీసా ఫ్రీ యాక్సెస్ లభించనుంది. ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ మూడో ర్యాంక్ సాధించగా.. ఈ దేశాల పాస్‌‌‌‌పోర్టులు ఉన్న వారికి 192 దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ లభించనుంది.

మనం ఎక్కడ?

ఇక ఈ లిస్టులో ఇండియా 80వ స్థానంలో నిలిచింది. ఇండియా పాస్‌‌‌‌పోర్టు ఉన్నోళ్లకు 62 దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ లభిస్తున్నది. ఉజ్బెకిస్తాన్ కూడా ఇదే ర్యాంకులో ఉంది. పొరుగు దేశం పాకిస్తాన్ ఈ లిస్టులో 101వ స్థానంలో ఉండగా.. 34 దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ ఉంది. వీసా ఫ్రీ ఎంట్రీ ఉన్న దేశాల లిస్టులో అఫ్గాన్ చిట్టచివరన నిలిచింది. ఈ దేశం పాస్‌‌‌‌పోర్టు ఉన్నోళ్లు 28 దేశాల్లో వీసా లేకుండానే పర్యటించేందుకు వీలుందని హెన్లీ పాస్‌‌‌‌పోర్ట్‌‌‌‌ ఇండెక్స్ తెలిపింది. తర్వాత 29 దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ ఉన్న దేశంగా సిరియా చివరి నుంచి రెండో స్థానంలో నిలిచిందని వివరించింది.