V6 News

మరికొన్ని వారాలే : కేంద్రం ప్రతీ ఒక్కరికి వ్యాక్సిన్ అందిస్తుంది

మరికొన్ని వారాలే : కేంద్రం ప్రతీ ఒక్కరికి వ్యాక్సిన్ అందిస్తుంది

మరికొన్ని వారాల్లో ఇండియాలో కరోనా వ్యాక్సిన్ విడుదల కానుంది. తొలివిడుతగా సుమారు 30 కోట్ల మంది ప్రజలకు అందివ్వనున్నట్లు కేంద్రం ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన పలు ఫార్మా సంస్థలు వ్యాక్సిన్ ను విక్రయించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు హెల్త్ సెక్రటరీ రాజేష్ భూషణ్ తెలిపారు.

“ కేంద్రం 300మిలియన్ మంది ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందించనుంది. వారిలో పోలీసులు, హెల్త్ వర్కర్లతో పాటు 50సంవత్సరాలకు పైబడిన వారున్నారు. ప్రతీ భారతీయుడికి కరోనా వ్యాక్సిన్ చాలా అవసరం. భారతీయులందరికి ఈ వ్యాక్సిన్ అందాలంటే సంవత్సరం పడుతుందని” భూషణ్ అన్నారు.

కాగా కరోనా వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం నిర్వహించే డ్రైవ్ లో సుమారు 1,54,000మంది హెల్త్ వర్కర్లు ఉన్నట్లు  కేంద్ర హెల్త్ సెక్రటరీ రాజేష్ భూషణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.