
న్యూఢిల్లీ: కరోనా బారి నుంచి కాపాడుకోవడానికి మాస్కు పెట్టుకోవాలని, ఎప్పటికప్పుడు చేతులను కడుక్కోవాలని, ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా చాలా దేశాలు చెప్పాయి. మనిషికి మనిషికి ఆరు అడుగుల దూరం ఉండాలని, అప్పుడే కరోనా అంటుకునే చాన్స్ తక్కువని అన్నాయి. కానీ ఆరడుగులతో కరోనాను ఆపలేమని కొందరు ఎక్స్‌పర్ట్స్ చెప్పారు. కొన్ని పరిస్థితుల్లో వైరస్ ఆరడుగుల కన్నా ఎక్కువ దూరం వెళ్తుందన్నారు. ఆరడుగులనేది స్టార్టింగ్ పాయింటని, అంతకు మించి దూరం ఉండాలని సూచిస్తున్నారు. ఆరడుగులకు మించి దూరం ఉన్నంత మాత్రాన కూడా రిస్క్ పోయినట్టుకాదని, దూరం పోతున్నకొద్దీ వైరస్ బారిన పడే ప్రమాదం తగ్గుతుందని గమనించాలని వివరించారు. గాలి ప్రసరణ, వెంటిలేషన్, ఎక్స్‌పోజర్ టైమ్, ఆ ప్రదేశంలో జనం ఎంతమందున్నారు, వాళ్లు ఫేస్ మాస్క్‌లు పెట్టుకున్నారా, నిశ్శబ్దంగా ఉన్నారా, మాట్లాడుతున్నారా, అరుస్తున్నారా, పాడుతున్నారా అనే విషయాలు 6 అడుగుల డిస్టెన్స్ సరిపోతదా లేదా అని నిర్ణయిస్తాయని వివరించారు. తక్కువ వెంటిలేషన్ ఉన్న ప్రాంతాలు, ఇరుకైన ప్రదేశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఈ విషయాలన్నింటికీ సంబంధించి బీఎంజే మెడికల్ జర్నల్‌లో అంటువ్యా ధుల ఎక్స్‌పర్ట్స్ అనాలిసిస్ పబ్లిష్ అయింది.
గాలి ద్వారా వస్తదని ప్రూవ్ కాకున్నా..
డ్రాప్‌లెట్స్ ఉన్న మైక్రోబ్స్ ప్రయాణించే దూరాన్ని బట్టి జర్మన్ బయాలజిస్ట్ కార్ల్ ఫ్లుగ్గీ 19వ శతాబ్దం టైమ్‌లో ఆరు అడుగులు సూచించారు. అయితే కొందరు మాత్రం ఎయిరోసోల్స్‌కు అంటుకొని కూడా వైరస్‌లు గాలిలో ప్రయాణించగలవని చెప్పారు. ఒకవేళ కరోనా కూడా నీటి ఆవిరిలాగ గాలిలో ప్రయాణించగలిగితే ప్రస్తుతం చెబుతున్న రేంజ్ సరిపోదని ఎక్స్‌పర్ట్స్ చెప్పారు. గాలి ద్వారా కరోనా వ్యాపిస్తదని ఇప్పటికింకా నిరూపితం కాకున్నా వైరస్ వచ్చిన వ్యక్తికి అడుగు దూరంలో ఉన్న వాళ్లనుంచి ఎక్కువగా సోకిన సందర్భాలు చాలా ఉన్నాయని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో ఎయిరోసోల్ ఎక్స్‌పర్ట్ జోస్ లూయిస్ చెప్పారు. ఈ మార్చిలో వాషింగ్టన్‌లో సింగింగ్ నేర్పిస్తున్న ఓ సింగర్‌నుంచి 45 అడుగుల దూరంలో ఉన్న వ్యక్తికీ వైరస్ అంటిందన్నారు. మొత్తంగా 52 మందికి కరోనా బారిన పడ్డారని చెప్పారు.
For More News..