న్యూఢిల్లీ: ఇరాన్, ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం వల్ల ఇప్పటివరకు ఆరుగురు ఇండియన్లు ప్రాణాలు కోల్పోయారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. మరొకరి ఆచూకీ తెలియకుండా పోయిందని వెల్లడించింది. శుక్రవారం విదేశాంగ శాఖ కార్యదర్శి (గల్ఫ్) అసీమ్ మహాజన్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
"బుధవారం రియాద్ పై ఇరాన్ జరిపిన దాడిలో ఒక ఇండియన్ మృతి చెందాడు. సౌదీలో నమోదైన తొలి భారతీయుడి మరణం ఇదే. దీని గురించి గురువారం రాత్రి మాకు సమాచారం అందింది. మృతుడి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నాం" అని పేర్కొన్నారు.
