రాహుల్ గాంధీ వెంట నడవనున్న తెలంగాణ నేతలు

రాహుల్ గాంధీ వెంట నడవనున్న తెలంగాణ నేతలు

సెప్టెంబర్ 7 నుంచి జరగనున్నకాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో తెలంగాణ నుంచి ఆరుగురు నేతలు పాల్గొననున్నారు. బెల్లయ్య నాయక్, కత్తి కార్తీక, కేతురి వెంకటేష్, సంతోష్ కోల్కుండా, వెంకట్ రెడ్డి, అనులేఖ బూస రాహుల్ వెంట నడవనున్నారు. 12 రాష్ట్రాలు, 2కేంద్రపాలిత ప్రాంతాల గుండా సాగనున్న ఈ యాత్రలో రాహుల్ వెంట నడవడానికి 117 మందిని ఏఐసీసీ సెలక్ట్ చేసింది. సెలక్ట్ అయిన వారికి రెండు రోజుల పాటు కన్యాకుమారిలో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. యాత్రలో పాల్గొనే వారికి గత నెలలోనే ఏఐసీసీ ఇంటర్వ్యూ లు నిర్వహించింది. 

కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 3500 కిలోమీటర్ల మేర రాహుల్ పాదయాత్ర సాగనుంది. మొత్తం 150 రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగనుండగా..దీనికి సంబంధించి ఏఐసీసీ ఇప్పటికే అన్నీ ఏర్పాట్లు చేసింది. అయితే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాహుల్ గాంధీ ఈ యాత్ర నుంచి విరామం తీసుకోనున్నారు.