టీ10 ఫార్మాట్‌‌‌‌లో టెన్నిస్‌‌‌‌ బాల్‌‌‌‌ లీగ్‌‌‌‌

టీ10 ఫార్మాట్‌‌‌‌లో టెన్నిస్‌‌‌‌ బాల్‌‌‌‌ లీగ్‌‌‌‌

ముంబై: ఇండియన్‌‌‌‌ క్రికెట్‌‌‌‌లోకి మరో కొత్త లీగ్‌‌‌‌ రాబోతున్నది. టీ10 ఫార్మాట్‌‌‌‌లో టెన్నిస్‌‌‌‌ బాల్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ లీగ్‌‌‌‌ను తీసుకొస్తున్నారు. దీనికి ఇండియన్‌‌‌‌ స్ట్రీట్‌‌‌‌ ప్రీమియర్‌‌‌‌ లీగ్‌‌‌‌ (ఐఎస్‌‌‌‌పీఎల్‌‌‌‌)గా పేరు పెట్టారు. ఇందులో ఆరు ఫ్రాంచైజీలు ముంబై (మహారాష్ట్ర), హైదరాబాద్‌‌‌‌ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌‌‌), బెంగళూరు (కర్ణాటక), చెన్నై (తమిళనాడు), కోల్‌‌‌‌కతా (వెస్ట్‌‌‌‌ బెంగాల్‌‌‌‌), శ్రీనగర్‌‌‌‌ (జమ్మూ అండ్‌‌‌‌ కశ్మీర్‌‌‌‌) ఉండనున్నాయి. ఈ ఆరు టీమ్స్‌‌‌‌ మొత్తం 19 మ్యాచ్‌‌‌‌లు ఆడతాయి. ప్రతి జట్టులో 16 మంది ప్లేయర్లు, ఆరుగురు సపోర్ట్‌‌‌‌ స్టాఫ్‌‌‌‌ ఉంటారు. స్టాఫ్‌‌‌‌కు రూ. 10 లక్షలు ఫీజుగా నిర్ణయించారు. ప్రతి ఫ్రాంచైజీ పర్స్‌‌‌‌ కోటి రూపాయలు. వేలంలో ప్లేయర్‌‌‌‌ బేస్‌‌‌‌ప్రైస్‌‌‌‌ రూ. 3 లక్షలు. వచ్చే ఏడాది  ఫిబ్రవరి 24న వేలం నిర్వహించనున్నారు. మార్చి 2 నుంచి 9 వరకు టోర్నీ జరగనుంది. టీమిండియా మాజీ కోచ్‌‌‌‌ రవిశాస్త్రి..  ఐఎస్‌‌‌‌పీఎల్‌‌‌‌ కమిషనర్‌‌‌‌గా వ్యవహరించనున్నాడు. బీసీసీఐ ట్రెజరర్‌‌‌‌ ఆశీష్‌‌‌‌ షీలార్‌‌‌‌, ముంబై క్రికెట్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ అమోల్‌‌‌‌ కాలె.. కోర్‌‌‌‌ కమిటీ మెంబర్స్‌‌‌‌గా ఉన్నారు.