స్కూల్ డుమ్మా కొట్టడానికి 6ఏళ్ల పాప మాస్టర్ ప్లాన్

స్కూల్ డుమ్మా కొట్టడానికి 6ఏళ్ల పాప మాస్టర్ ప్లాన్

స్కూల్ అంటే చాలు గజ్జున వనుకుతరు కొందరు పిల్లలు.. పోనంటే పోను పోనంటే పోను అని మారం కూడా చేస్తుంటరు.. మనలో కూడా కొందరు అలాగే ఉంటుండె కదా.. ఆ అవును మరి. సేమ్ ఇలాగే యూకే లో ఒక పిల్ల స్కూలుకు డుమ్మకొట్టడానికి మాస్టర్ ప్లాన్ వేసింది. ఆ చిన్న పిల్ల పేరు లిల్లీ.. స్కూలులో ఓరోజు స్పెల్లింగ్ టెస్ట్ పెట్టడానికి వాళ్ల టీచర్ రెడీ అయింది. దీంతో.. ఆ రోజు బడికి డుమ్మా కొట్టాలని నిర్ణయించుకుంది లిల్లీ. అనుకున్నదే ఆలస్యం.. వాళ్ల అమ్మ దగ్గరికి వెళ్లి హోం వర్క్ చేయడానికి రెడ్ కలర్ పర్మనెంట్ స్నెచ్ పెన్ కావాలని అడిగి తీసుకుంది. ఆ తర్వాత బాత్ రూమ్ కు వెళ్లి శరీరం అంతా.. రెడ్ కలర్ సర్కిల్స్ పెట్టుకుని వాళ్ల అమ్మకు చూపించింది.

తనకు ఒళ్లంతా దద్దుర్లు అయ్యాయని మంట పుడుతుందని చెప్పింది. చికెన్ ఫాక్స్ అయ్యాయేమోనని షాక్ అయిన లిల్లీ పేరెంట్స్ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడానికి రెడీ అయ్యారు. తీరా పరిశీలించేసరికి ఆ రెడ్ కలర్ సర్కిల్స్ స్కెచ్ పెన్ తో పెట్టుకుందని తెలుసుకున్నారు. స్కూల్ డుమ్మా కొట్టడానికి లిల్లీ వేసిన ప్లాన్ తుస్సుమనడంతో లిల్లీ వాళ్ల అమ్మ కొప్పడింది. ఒక వైపు నవ్వుతో పాటు కోపం కూడా వచ్చిందని లిల్లీ పేరెంట్స్ తెలిపారు. పర్మనెంట్ మార్కర్ తో పెట్టుకున్న సర్కిల్స్ పోవడానికి నాలుగు రోజులు పట్టిందని లిల్లీ పేరెంట్స్ చెప్పారు. ఆ తర్వాత లిల్లీకి స్కూలుకు వెళ్లడం మాత్రం తప్పలేదు.