
సికింద్రాబాద్ లో అగ్ని ప్రమాదం జరిగిన డెక్కన్ మాల్ బిల్డింగ్ కూల్చివేతకు జీహెచ్ఎంసీ టెండర్ ఖరారు చేసింది. ఎస్కే మల్లు ఏజెన్సీ టెండర్ దక్కించుకుంది. భవనం కూల్చివేత కోసం జీహెచ్ఎంసీ రూ.33.86లక్షలకు టెండర్ పిలిచింది. దాదాపు 8 ఏజెన్సీలు టెండర్లు దాఖలు చేయగా.. ఎస్కే మల్లు ఏజెన్సీ 38.14శాతం తక్కువ మొత్తాన్ని కోట్ చేసి టెండర్ దక్కించుకుంది. రూ. 22 లక్షలకే ఎస్కే మల్లు ఏజెన్సీ డెక్కన్ మాల్ బిల్డింగ్ ను కూల్చి వేయనుంది. పోలీస్, రెవెన్యూ అధికారుల క్లియరెన్స్ అందిన వెంటనే గురువారం నుంచి కూల్చివేత పనులు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.