Skin Beauty: స్కిన్ కేర్ ఇలా తీసుకోండి... చర్మం మెరిసిపోద్ది.. ఎలాగంటే..!

Skin Beauty:   స్కిన్ కేర్ ఇలా తీసుకోండి... చర్మం మెరిసిపోద్ది..  ఎలాగంటే..!

మేకప్ వేరు, స్కిన్​ కే  వేరు. మేకప్ వేసుకోకుండా, చర్మం రంగు ఎలా ఉంటే అలానే... నేచురల్ బ్యూటీగానే కనిపించాలనుకుంటున్నారా. అది ఓకే. అయినప్పటికీ స్కిన్ కేర్ మాత్రం తప్పనిసరి. చర్మం మృదువుగా ఉండటానికి, ఎండను తట్టుకోవడానికి, కాలుష్యం నుంచి తప్పించుకోవడానికి ఒక రొటీన్ అవసరంఆ రొటీన్లో క్లెన్సర్, క్లెన్సర్, టోనర్, మాయిశ్చరై జర్, సీరమ్ సన్ స్క్రీన్ అన్నీ ఉంటాయి. అలాగే... అవి ఎలా...  ఎప్పుడు, ఏ పద్ధతిలో వాడాలో అన్నదానికి కూడా ఒక రొటీన్ ఉంటుంది. ఏది? ఎలా వాడుతున్నారు?

క్లెన్సింగ్:  ఉదయం, సాయంత్రం రెండు సార్లు ముఖాన్ని క్లెన్సర్​ తో  శుభ్రంగా కడగండి. ఇది చర్మానికి కాంతిని తీసుకొస్తుంది. ముఖం డల్​ గా ఉండకుండా పనిచేస్తుంది. 

టోనర్: చర్మం పొడిబారకుండా...  యవ్వనంగా ఉండేందుకు టోనర్ సాయపడుతుంది

సీరమ్ :  కాలుష్యాన్ని తట్టుకోవడానికి, చర్మం మండకుండా ఉండటానికి సీరమ్ అవసరం. సీరమ్ రాసుకున్నప్పుడు చర్మంలోకి ఇది మొత్తం ఇంకాలి. కాబట్టి ఐదు, పది నిమిషాల తర్వాతే ఆ తర్వాతి ప్రొడక్ట్ వాడితే మంచిది.

మాయిశ్చరైజర్ :  చర్మం మీద ముడతలు, దద్దుర్లను ఎదుర్కోవ దానికి మాయిశ్చరైజర్స్ వాడాల్సి ఉంటుంది. జిడ్డుచర్మం ఉన్నవాళ్లకు కూడా ఇది వాడితే ఫలితం కనిపిస్తుంది.

సన్ స్క్రీన్:  ఉదయం పూట ఇంట్లోంచి బయటకు వెళ్లడా నికి ఒక పదిహేను నిమిషాల ముందే సన్ స్క్రీన్ రాసుకోండి. కాస్త మబ్బులు పట్టినట్టు ఉన్న రోజున కూడా సన్​ స్క్రీన్ వాడితేనే మంచిది. లేదంటే మీ మాయిశ్చరైజర్​ లో  ఎస్పీఎఫ్ 20 ఉంటే నేరుగా అది రాసుకునే బయటికి వెళ్లొచ్చు.

ఇదంతా స్కిన్​ కోర్ కోసమే! అంటే చర్మం నిగారించడానికి, కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి  స్కిన్ కేర్ పూర్తయ్యాక కావాలనుకుంటే మేకప్ చేసుకోవచ్చు. ఇలాగే వెళ్లి, నేచురల్ బ్యూటీగానే ఉందామనుకున్నా, ఈ జాగ్రత్తలయితే తీసు కోవాలి. ఏ స్కిన్​  కేర్​ ప్రొడక్ట్​ అయినా ఆరు వారాలు వాడాలి.  ఆ తరువాతే ఫలితం కనిపిస్తుంది. 

వెలుగు,లైఫ్​