స్కైరూట్కు రూ.1,800 కోట్లు! ఫండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత యూనికార్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారే అవకాశం

స్కైరూట్కు రూ.1,800 కోట్లు! ఫండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తర్వాత యూనికార్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారే అవకాశం

న్యూఢిల్లీ: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన స్పేస్- టెక్ స్టార్టప్ స్కైరూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏరోస్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.1,800 కోట్లు (150–200 మిలియన్ డాలర్లు) సేకరించేందుకు రెడీ అవుతోంది. ఈ ఫండింగ్ రౌండ్ పూర్తయితే కంపెనీ వాల్యుయేషన్ బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, యూనికార్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరుతుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఫండింగ్ రౌండ్ కోసం  కోటక్  మహీంద్రా క్యాపిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కంపెనీ నియమించిందని అన్నారు.    

స్కైరూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇప్పటికే సింగపూర్ సావరిన్ ఇన్వెస్టర్లు జీఐసీ, టెమాసెక్ ఇన్వెస్ట్ చేశాయి. కొత్త పెట్టుబడిదారులకు ప్రైమరీ షేర్లు  జారీ చేస్తారు.  అందువల్ల ప్రస్తుత షేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హోల్డర్ల వాటా తగ్గదు.  

2022లో కంపెనీ విలువ 163 మిలియన్ డాలర్లు కాగా, 2023లో టెమాసెక్, జీఐసీ కలిసి 27.5 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాయి. ఆ  తర్వాత కంపెనీ వాల్యుయేషన్  519 మిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాలర్లకు పెరిగింది.