పండుగ ముందు లాభాలు పొందిన బ్రాడ్ మార్కెట్‌

పండుగ  ముందు లాభాలు పొందిన బ్రాడ్ మార్కెట్‌

బిజినెస్ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: పండుగ  ముందు బ్రాడ్ మార్కెట్‌‌‌‌(స్మాల్‌‌‌‌ క్యాప్‌‌‌‌, మిడ్ క్యాప్ షేర్లు) లాభాల్లో  కదిలింది. ఈ టైమ్‌‌‌‌లో కొన్ని మిడ్ క్యాప్ షేర్లు ఎక్కువ వాల్యూమ్స్‌‌‌‌తో పెరిగాయి. మూడు రంగాలకు చెందిన  ఇలాంటి  ఐదు షేర్లను ఈటీ స్క్రీనర్ ఇన్వెస్టర్లకు రికమండ్ చేస్తోంది. ఈ షేర్లు ప్రస్తుత స్థాయి నుంచి 43 శాతం వరకు పెరుగుతాయని అంచనావేస్తోంది. బీఎస్‌‌‌‌ఈ, ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈలలోని 4 వేలకు పైగా షేర్లను విశ్లేషించి ఈ రికమండేషన్స్‌‌‌‌ చేస్తున్నామని ఈటీ స్క్రీనర్‌‌‌‌‌‌‌‌ ( రిఫినిటివ్‌‌‌‌ స్టాక్ రిపోర్ట్ ప్లస్‌‌‌‌ ప్రకారం) పేర్కొంది. కంపెనీ ఎర్నింగ్స్‌‌‌‌, ఫండమెంటల్స్‌‌‌‌, ఇతర కంపెనీలతో పోల్చిన వాల్యుయేషన్‌‌‌‌, రిస్క్‌‌‌‌, ప్రైస్  కదలిక వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ షేర్లను రికమండ్ చేసింది. కింద ఇచ్చిన మిడ్ క్యాష్ షేర్లు గత వారం రోజుల్లో పాజిటివ్‌‌‌‌గా కదిలాయి. అంతేకాకుండా వీటికి  స్టాక్ రిపోర్ట్ ప్లస్ ఇచ్చే స్కోర్ వారం ప్రాతిపదికన కనీసం  ఒక పాయింట్ పెరిగిందని   ఈటీ స్క్రీనర్ వెల్లడించింది. వీటికి కనీసం ఏడు మంది ఎనలిస్ట్‌‌‌‌లు  ‘స్ట్రాంగ్ బై’ లేదా ‘బై’ కాల్ రేటింగ్‌‌‌‌ను ఇచ్చారని  పేర్కొంది. ఎనలిస్టులు అంచనాల మేరకు కింద పేర్కొన్న షేర్లు ఇంకో ఏడాది కాలంలో ప్రస్తుత స్థాయి నుంచి  మంచి లాభాలిస్తాయని అంచనావేసింది.

జైడస్ వెల్‌‌‌‌నెస్‌‌‌‌: జైడస్ వెల్‌‌‌‌నెస్ షేరుపై ఎనిమిది మంది ఎనలిస్టులు ‘బై’ కాల్‌‌‌‌ను ఇచ్చారు. ఈ కంపెనీ షేరు శుక్రవారం రూ.1,741 వద్ద క్లోజయ్యింది. ఈ షేరు ప్రస్తుత లెవెల్‌‌‌‌ నుంచి ఇంకో 23% పెరుగుతుందని అంచనా. గత వారం రోజుల్లో 8 % రిటర్న్‌‌‌‌ను ఇచ్చింది.

ఫోర్టిస్ హెల్త్‌‌‌‌కేర్‌‌‌‌‌‌‌‌: ఫోర్టిస్ హెల్త్‌‌‌‌కేర్‌‌‌‌‌‌‌‌పై 9 మంది ఎనలిస్టులు బుల్లిష్‌‌‌‌గా ఉన్నారు. ఈ షేరు శుక్రవారం సెషన్‌‌‌‌లో రూ.275 వద్ద ముగిసింది. ఈ లెవెల్ నుంచి మరో  19 % పెరుగుతుందని అంచనా. కంపెనీ షేర్లు గత వారం రోజుల్లో 4 % రిటర్న్ ఇచ్చాయి. అంబర్‌‌‌‌‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌:  అంబర్‌‌‌‌‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్‌‌‌‌ షేరుపై 13 మంది ఎనలిస్టుల ‘బై’ కాల్‌‌‌‌ను ఇచ్చారు.  ఈ కంపెనీ షేరు గత వారం రోజుల్లో ఇన్వెస్టర్లకు 3 % రిటర్న్ ఇచ్చింది. ఈ షేరు ఇంకో ఏడాది కాలంలో  12 %  పెరుగుతుందని ఎనలిస్టుల అంచనా.  ఈ కంపెనీ షేరు శుక్రవారం రూ.2,345 వద్ద క్లోజయ్యింది. 

మణప్పురం ఫైనాన్స్‌‌‌‌ :
ఈ కంపెనీ  లాభాలు తాజాగా మెరుగయ్యాయని స్టాక్ రిపోర్ట్‌‌‌‌ ప్లస్ వెల్లడించింది. మొత్తంగా 12 మంది ఎనలిస్టులు ఈ కంపెనీ షేరుపై  ‘స్ట్రాంగ్ బై’ కాల్ రేటింగ్‌‌‌‌ను ఇచ్చారు. ఈ షేరు శుక్రవారం రూ.102 వద్ద క్లోజయ్యింది. ఈ లెవెల్‌‌‌‌ నుంచి ఏడాది కాలంలో మరో 43 శాతం పెరుగుతుందని అంచనా. ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.8,646 కోట్లు కాగా, గత వారం రోజుల్లో 7 శాతం రిటర్న్‌‌‌‌ను ఇచ్చింది. 

నారాయణ హృదయాలయ
ఈ కంపెనీ షేరుపై ఏడు మంది ఎనలిస్టులు బుల్లిష్‌‌‌‌‌‌గా ఉన్నారు. కంపెనీ షేరు మరో 7 శాతం పెరుగుతుందని అంచనావేస్తున్నారు. శుక్రవారం సెషన్‌‌‌‌లో నారాయణ హృదయాలయ షేరు రూ. 713 వద్ద క్లోజయ్యింది. గత వారం రోజుల్లో ఈ షేరు ధరలో ఎటువంటి మార్పు లేదు. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 14,504 కోట్లు.