ప్యాంట్ జేబులో పేలిన సెల్ ఫోన్..హైదరాబాద్ యువకుడికి గాయాలు

ప్యాంట్ జేబులో పేలిన సెల్ ఫోన్..హైదరాబాద్ యువకుడికి గాయాలు

ఫోన్లు పేలుతున్న సంఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట చూస్తునే ఉన్నాం.  తాజాగా ఓ యువకుడి ప్యాంటు జేబులో ఉన్న ఫోన్ సడెన్ గా  పేలింది.  అతడు వేసుకున్న బట్టలకు అంటుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా   రాజేంద్రనగర్ అత్తాపూర్ లో జరిగింది.

పెయింటర్ గా పనిచేస్తున్న  శ్రీనివాస్ అనే యువకుడు స్మార్ట్  ఫోన్  వాడుతున్నాడు. తన ప్యాంటు జేబులో పెట్టుకొని వస్తుండగా.. ఒక్కసారిగా ఫోన్ హీటెక్కి మంటలు రావడంతో  జేబులో నుంచి ఫోన్ తీశాడు. అప్పటికే  ఫోన్ హీట్ వల్ల శ్రీనివాస్   కాలి తొడ స్వల్పంగా  కాలిపోయింది. వెంటనే స్థానికంగా ఉన్న హాస్పటల్ కి  వెళ్లాడు శ్రీనివాస్ . తొడ పై భాగంలో ఉన్న చర్మం కాలి మరో లేయర్ వరకు కాలిపోయిందని ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ తెలిపారు.  వెంటనే అప్రమత్తం కాకపోయి కండరాల్లోకి వెళ్లి తీవ్రంగా నష్టం జరిగేదని చెప్పారు.

►ALSO READ | శాంతినగర్ లో పట్టపగలే గోల్డ్  షాప్ లో చోరీ

 ఇటీవలే మే 25న ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ జిల్లాలోని ఛరా పరిధిలో ఓ యువకుడి ఐ ఫోన్ పేలింది. అదే విధంగా మే 23న ఏపీలోని అన్నమయ్య జిల్లా రాయచోటీలో బీటెక్ విద్యార్థి ఫోన్ తన జేబులో  పేలిపోయింది. అతడికి తీవ్రగాయాలయ్యాయి.

 ప్యాంట్ జేబులో సెల్ ఫోన్ పేలిన ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. ఫోన్ ఓవర్ హీట్ అయ్యే వరకు చార్జింగ్ పెట్టకూడదని.. బ్యాటరీ డ్యామేజీ కావడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ ఓవర్ హీట్ అయితే జేబుల్లోంచి తీసి కాస్త చల్లటి ప్రదేశంలో పెట్టాలని సూచిస్తున్నారు.