
శాంతినగర్, వెలుగు: పట్టణంలోని శ్రీనివాస జ్యువెలరీ గోల్డ్ షాప్ లో గురువారం పట్టపగలు చోరీ జరిగింది. షాప్ తెరుస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి తనకు బంగారం కావాలని నమ్మించాడు. షాప్ లోకి వచ్చి రూ.50 వేల వెండి ఆభరణాలు, రూ.2 లక్షల నగదు ఉన్న బ్యాగును ఎత్తుకెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. శాంతినగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.