స్మిత సబర్వాల్ మరో ట్వీట్.. నేను ఇక్కడే ఉంటా

స్మిత సబర్వాల్ మరో ట్వీట్.. నేను ఇక్కడే ఉంటా

కేంద్ర సర్వీసుల్లోకి వెళ్తున్నానంటూ వస్తున్న  వార్తలను ఖండించారు ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్. అవన్ని అవాస్తవమని తాను ఎక్కడికి వెళ్ళడం లేదని ట్విట్టర్లో వెల్లడించారు. తాను రాష్ట్రంలోనే పనిచేస్తానని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తనకు ఏ బాధ్యత అప్పజెప్పినా నిర్వహిస్తానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో భాగమైనందుకు  తాను గర్విస్తున్నట్లు చెప్పారు.
 
కేసీఆర్ హయాంలో  కీలకంగా వ్యవహరించిన  స్మిత సబర్వాల్..  తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా  కాళేశ్వరం పనులతోపాటు మిషన్ భగీరథ పనులను పర్యవేక్షించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఇప్పటి వరకు ఆమె కలవలేదు. దీంతో స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాలని యోచిస్తున్నట్లు.. కేంద్రానికి దరఖాస్తుచేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.  తెలుగు రాష్ట్రాల్లో 23 ఏళ్ల సర్వీసు చేశానని ఆమె గుర్తు చేసుకుంటూ..  కొత్త ఛాలెంజ్ లకు ఎప్పుడూ సిద్దం అంటూ  ట్వీట్ చేయడమే ఇందుకు కారణం. 

మరో వైపు ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ను కేంద్ర సర్వీసుల్లోకి పంపొద్దని రిటైర్డ్ ఐఏఎస్  ఆకునూరి మురళీ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.  గత ప్రభుత్వంలో చేసినవన్నీ చేసి కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర ప్రభుత్వంకు వెళ్లి  ఇక్కడి తప్పులను తప్పించుకోడం  కొంత మంది ఐఏఎస్ లకు  ఫ్యాషన్ అయ్యిందని ట్వీట్ చేశారు.  తెలంగాణ ప్రభుత్వం వీళ్ళను కేంద్రంకు పంపకుండా చర్యలు తీసుకోవాలి.. ఏం తప్పులు చెయ్యకపోతే ఎందుకు భుజాలు తడుముకోడం అని వ్యాఖ్యానించారు.  దేశంలో  హెలికాఫ్టర్ లో వెళ్లి పనులను పర్యవేక్షించే  ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఈమెగారే అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు ఆకునూరి మురళీ.