
- ఈ జాబ్‌లో ఫీల్డ్‌కు వెళ్లాల్సి ఉంటుంది
- స్మిత క్షమాపణ చెప్పాలి: వీరయ్య
- ఆమెపై సీఎం చర్యలు తీసుకోవాలి: బాలలత
- సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ వివాదాస్పద ట్వీట్
హైదరాబాద్, వెలుగు: సివిల్ సర్వీసెస్ నియామకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా? అని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్‌పై దుమారం చెలరేగుతున్నది. దివ్యాంగులకు గౌరవం ఇవ్వాలని అంటూనే.. అత్యంత కీలక సర్వీసులకు ఈ కోటా ఎందుకంటూ ఆమె ప్రశ్నించారు. ‘‘ఈ సర్వీసెస్‌లో ఫీల్డ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. పబ్లిక్ సమస్యలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ సేపు పని చేయాల్సి ఉంటది.
సివిల్స్ ఆఫీసర్లు ఎంతో ఫిట్‌గా ఉండాలి. ఈ సర్వీసెస్‌లో దివ్యాంగుల రిజర్వేషన్ ఉంచాల్సిన అవసరం ఏముంది?’’అని ఆమె ట్వీట్లో ప్రశ్నించారు. దివ్యాంగులు అంటే తనకు గౌరవం ఉందని పేర్కొన్నారు. ‘‘వారిని ఎయిర్‌లైన్స్ కంపెనీలు పైలెట్‌గా తీసుకుంటాయా? దివ్యాంగులైన డాక్టర్లను ఎవరైనా నమ్ముతారా?”అని ప్రశ్నించారు. స్మితా సిబర్వాల్ చేసిన ట్వీట్.. దేశవ్యాప్తంగా వివాదాస్పదం అవుతున్నది. పలువురు సీనియర్ అధికారులు ఆమెపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
ఓ ఐఏఎస్ స్థాయి అధికారి దివ్యాంగులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యానికి గురి చేసిందని ఓ నెటిజన్ అన్నారు. వైకల్యం అనేది.. శక్తి సామర్థ్యాల మీద ప్రభావం చూపించదని తెలిపారు. దీనిపై అవగాహన కల్పించాలంటూ సెటైరికల్‌గా రీ ట్వీట్ చేశారు. ఇలాంటి అధికారులు.. దివ్యాంగులపై చేస్తున్న కామెంట్లు చూస్తే జాలీ వేస్తున్నదని మరో నెటిజన్ అన్నారు. సంకుచితంగా మాట్లాడుతూ.. గౌరవాన్ని తగ్గించుకుంటున్నారని మరో నెటిజన్ మండిపడ్డాడు.