విశాఖ–మహబూబ్‌నగర్ రైలులో పొగలు.. తుని వద్ద నిలిపివేత

విశాఖ–మహబూబ్‌నగర్ రైలులో పొగలు.. తుని వద్ద నిలిపివేత

 

విశాఖపట్నం నుంచి మహబూబ్‌నగర్ వెళ్తున్న రైలులోని S5 బోగీ కింద పొగలు రావడంతో కలకలం చోటుచేసుకుంది. ఈ ఘటనను గుర్తించిన రైల్వే సిబ్బంది అప్రమత్తమయ్యారు. 

తుని రైల్వే స్టేషన్ వద్ద రైలును నిలిపివేసి, S5 బోగీ కింద నుంచి పొగలు రావడానికి గల కారణాలను పరిశీలించారు. ముందుగానే ఈ విషయాన్ని గుర్తించడంతో సిబ్బంది వెంటనే మరమ్మతు పనులు చేపట్టారు.

రైల్వే సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ఘటనకు గల పూర్తి కారణాలు, రైలు తిరిగి ఎప్పుడు బయలుదేరుతుందనే వివరాలు తెలియాల్సి ఉంది.