ఐసీసీ విమెన్స్ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌‌‌‌లో స్మృతి మంధానకు సెకండ్ ర్యాంక్

ఐసీసీ విమెన్స్ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌‌‌‌లో స్మృతి మంధానకు సెకండ్ ర్యాంక్

దుబాయ్: టీమిండియా ఓపెనర్ స్మృతి మంధాన ఐసీసీ విమెన్స్ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌‌‌‌లో తిరిగి టాప్‌‌‌‌ ప్లేస్ కైవసం చేసుకునేందుకు మరింత చేరువైంది. శ్రీలంకలో జరిగిన ట్రై -నేషన్స్‌‌‌‌ వన్డే టోర్నమెంట్‌‌‌‌లో సూపర్ బ్యాటింగ్‌‌‌‌తో ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించిన మంధాన మంగళవారం విడుదలైన తాజా ర్యాంకింగ్స్‌‌‌‌లో మూడు నుంచి రెండో ర్యాంక్‌‌‌‌కు చేరుకుంది. మంధాన చివరగా 2019లో వన్డే బ్యాటర్లలో అగ్రస్థానంలో నిలిచింది.

ప్రస్తుతం నంబర్ వన్‌‌‌‌ ర్యాంక్‌‌‌‌లో ఉన్న సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్‌‌‌‌వర్ట్‌‌‌‌  కంటే 11 రేటింగ్ పాయింట్లు వెనుకంజలో ఉంది. శ్రీలంక కెప్టెన్ చామరి ఆటపట్టు రెండు స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంక్‌‌‌‌కు చేరుకుంది.  ఇండియా ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ 20 నుంచి 15వ ర్యాంక్‌‌‌‌కు చేరుకుంది. ట్రై సిరీస్‌‌‌‌లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన ఇండియా స్పిన్నర్ స్నేహ్ రాణా  బౌలర్ల ర్యాంకింగ్స్‌‌‌‌లోనాలుగు స్థానాలు మెరుగై 34వ స్థానానికి చేరుకుంది.