కారు డిక్కీలో అక్రమంగా లిక్కర్ బాటిల్స్

కారు డిక్కీలో అక్రమంగా లిక్కర్ బాటిల్స్
  • అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

లిక్కర్ బాటిల్స్ తరలిస్తున్న కారును బొల్లారం పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం బొల్లారం చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తున్నారు. ఓ కారును చెక్ చేయగా..డిక్కీలో 25 లిక్కర్ బాటిల్స్ కనిపించాయి. కారుతో పాటు బాటిల్స్ ను సీజ్ చేశారు. ఓ న్యూస్ చానల్ ఏరియా రిపోర్టర్ వీటిని కారులో తరలిస్తున్నట్టు గుర్తించారు. అతడిపై బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు. శంకర్ పల్లిలో.. మండలంలోని ఆలంఖాన్ గూడ గ్రామంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచి 111 లిక్కర్ బాటిల్స్ ను శంకర్ పల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దమ్మన్న గారి నాగిరెడ్డి, చేకూర్త బాల్ రెడ్డి పై కేసు నమోదు చేశారు.