
గండిపేట, వెలుగు: నార్సింగి మున్సిపాలిటీలోని మంచిరేవుల వేణుగోపాల స్వామి దేవాలయంలో శుక్రవారం ఉదయం పాము కలకలం సృష్టించింది. జగన్నాథ మందిర తలుపులు తెరవగానే, పాము కనిపించడంతో పూజారి వరదాచార్యులు, స్థానిక భక్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సంస్థ ప్రతినిధులు దేవాలయంలో పాటును పట్టుకొని అడవిలో విడిచిపెట్టారు.